కవితను కలిసిన వినోద్‌చారి
16-09-2026 | 10:54am
వాంకిడి,(విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడి(Party Presidents)గా నియమితులైన కె.వినోద్‌చారి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవితకు పుష్పగుచ్ఛం అందజేసి, తనపై నమ్మకంతో జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వినోద్‌చారి పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.