రాజ్యాంగ విలువల ఉల్లంఘన!

26-09-2026 | 05:00am

భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) అత్యంత కీలకమైన, స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ. దేశంలో నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈ వ్యవస్థది. అయితే ఇటీవల వెలువడుతున్న కథనాలు, చోటు చేసుకుంటున్న పరిణామాలు కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై, రాజ్యాంగ నిబంధనల అమలుపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి కొద్దిరోజుల ముందే  కేంద్రం ఎన్నికల సంఘంలో నియమితులైన జ్ఞానేష్‌కుమార్ నియామకం వెనుక ఉన్న రాజకీయ ప్రాధాన్యతలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.

 గడిచిన పది నెలల కాలంలో జ్ఞానేష్‌కుమార్ తీసుకున్న పలు నిర్ణయాలపై తోటి ఎన్నికల అధికారులు కనీసం 14సార్లు అభ్యంతరాలలు వ్యక్తం చేసినట్టు కథనాలు వెలువడటం గమనార్హం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకాభిప్రాయంతో, లేదంటే మెజార్టీ సభ్యుల అంగీకారంతో జరగాలి.  కానీ, నిబంధనలకు భి న్నంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.  ఏకంగా పన్నెండు కోట్ల మంది భారతీయులు  తమ ఓట్లు కోల్పో వడం ఆందోళన కలిగిస్తోంది. 

జ్ఞానేష్‌కుమార్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి?   

1988 బ్యాచ్‌కు చెందిన కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్‌కుమార్ కాన్పూర్  ఐఐటీ నుంచి పట్టభద్రుడిగా పట్టా పొందారు. కేరళలో కాంగ్రె స్, వామపక్ష ప్రభుత్వాల హయాంలో అనేక కీలక శాఖల్లో పనిచేశారు. అనంతరం కేంద్ర పరిపాలనలోకి వచ్చిన ఆయన.. పలు కేంద్ర శాఖల నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారు. చివరకు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. ఆ తర్వాత రెండు నెలలలోపే ఎన్నికల అధికారిగా నియమితులవడం గమనార్హం.

అయితే, ఈ నియామకం వెనుక ఉన్న ప్రక్రియ వివాదాస్పదమైంది. గత నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టం ప్రకారం ఎన్నికల అధికారులను ఎంపిక చేసే ముగ్గురు సభ్యుల కమిటీ నుంచి సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్‌ను తొలగించారు. ఆ స్థానంలో కేవ లం ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ప్రతిపక్ష నేత మాత్రమే ఉంటారు. దీనివల్ల నియామక ప్రక్రియలో ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని, స్వతం త్రత దెబ్బతింటుందని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది.

అయినా కేంద్రం తన నిర్ణయానికే కట్టుబడింది. మార్చిలో అధికారిగా ఉన్న అరుణ్ గోయల్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం, ఆ వెంటనే ఈ నూతన చట్టం కింద జ్ఞానేష్‌కుమార్ నియామకం జరగడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మరో వైపు, ఆయన కుటుంబ నేపథ్యం కూడా వివాదాలకు అతీతంగా ఏమీ లేదు. ఆయన కుమార్తె మేధా రూపం జిల్లా అధికారిగా ఉన్న సమయంలో ఒక విద్యార్థినిపై తీవ్రమైన చట్టాల కింద కక్షపూరితంగా చర్యలు తీసుకున్నందుకు అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టి, రూ.5లక్షల జరిమానా విధించడం.. పరిపాలనాపరమైన నియంతృత్వ ధోరణులకు అద్దం పడుతోంది.

ఒకవైపు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం తన పరిపాలనా విభాగంగా మార్చుకుంటోందన్న విమర్శలు రావడం, మరోవైపు రాజ్యాంగం స్పష్టం చేసిన అధికరణం ప్రకారం ఏకాభిప్రాయ నిర్ణ యాలు జరగకపోవడం  ప్రజాస్వామ్య భవిష్యత్తుకు శుభసూచ కం కాదు. రాజ్యాంగ వ్యవస్థలు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుం డా, నిష్పాక్షికంగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్యంపై ప్రజ లకు విశ్వాసం పునరుద్ధరించబడుతుంది.ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కాపాడుకోవాల్సి న అత్యవసర సమయం ఇది. 

సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు, 9848559863

వెంకగారి భూమయ్య

మరిన్ని వార్తలు