30 April, 2026 | 4:05 AM

టెన్త్ ఫలితాల్లో వివేకానంద విక్టరీ

30-04-2026 02:49 AM

వేములవాడ,ఏప్రిల్ 29,(విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణానికి చెం దిన వివేకానంద హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి - 2026 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 31 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై అందరూ ఉత్తీర్ణులై 100 శాతం ఫలితాలు సాధించారు. వీరిలో 7 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను నిలబెట్టారు.ప్రముఖంగా యు.జ్యోష్న (561), జి.లోకేష్ (560), పి.హష్వంత్ (543), జి. వినీల (532), జి. శ్రీనిధి (529), సీహెచ్. దీక్షిత (525), భవానీ దుర్గ ప్రసాద్ (525) ఉత్తమ మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గడిల ప్రసాద్ ఆనం దం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల అంకితభావం ఈ విజయానికి కారణమని తెలిపారు.