పది ఫలితాల్లో సిద్ధార్థ విద్యాసంస్థల విజయభేరి
ముకరంపుర, ఏప్రిల్ 29(విజయక్రాంతి): కరీంనగర్‌లోని సిద్ధార్థ విద్యాసంస్థల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల ఫలితాలలో విజయదుందుభి మోగించారు. 452 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 100 శాతం ఉత్తీర్ణత సాధించి 592 మార్కులతో కె. విశ్వక్సేన్ జిల్లా టాపర్గా నిలిచి ప్రభంజనం సృష్టించాడు.570 మార్కులకు పైగా 31 మంది విద్యార్థులు, 560 మార్కులకు పైగా 74 మంది విద్యార్థులు, 550 పైగా 122 మంది విద్యార్థులు మార్కులు సాధించి సిద్ధార్థ కీర్తి పతాకాన్ని గగన వీధుల్లో మరోసారి ఎగురవేశారు.
సిద్ధార్థ 30 సంవత్సరాల ప్రస్థానంలో ప్రతీ నలుగురు విద్యార్థులకు ఒక్క విద్యార్థి చొప్పున 550 పైగా మార్కులు సాధించడం గర్వకారణం.అంతేకాకుండా ఐఐటీ, నీట్ విభాగాలలో సిద్ధార్థ పాఠశాల విద్యార్థులు ముందంజలో ఉండడం విశేషనీయం. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్రెడ్డి ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులను అభినందించి, హర్షం ప్రకటించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ దాసరి శ్రీ పాల్ రెడ్డి, డైరెక్టర్ స్వప్న శ్రీ పాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం,తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.






