13 July, 2026 | 5:11 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

జూలై 24లోపు ఓటరు ధృవీకరణ ఫారం తప్పనిసరిగా సమర్పించాలి

13-07-2026 03:59 PM

హుజూర్నగర్ అసెంబ్లీ బిజెపి "సర్" ఇంచార్జి  తాళ్ల నరేందర్ రెడ్డి

నేరేడుచర్ల, జూలై 13(విజయక్రాంతి): "సర్ " కి సంబంధించి బి ఎల్ వో లు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారం ను జాగ్రత్తగా నింపి జులై 24 లోపు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇవ్వాలని బిజెపి సర్ హుజూర్నగర్ నియోజకవర్గ  కన్వీనర్ తాళ్ల నరేందర్ రెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ, జూలై 24 తో ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగుస్తుందని,జులై 31న ముసాయిదా ఓటరు జాబితా (Draft Electoral Roll) విడుదలవుతుందని,ఇందులో మీ పేరు, వివరాలు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవచ్చన్నారు.

జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్ మరియు అభ్యంతరాలు (Claims & Objections) దాఖలు చేసే సమయం ఉంటుందని, సెప్టెంబర్ 28వరకు ఈ.ఆర్.వో లు అభ్యంతరాలపై విచారణ చేసి, అక్టోబర్ 10 న తుది ఓటరుజాబితా విడుదల చేస్తారని,జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ జాబితాలో మీ పేరు లేకపోతే  ఫామ్ -6 ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని,అలాగే ముసాయిదా జాబితాలో పేరు కానీ, చిరునామా ఏవైనా వివరాలు తప్పుగా ఉన్నా ,  మీ ఓటును ఒక బూత్ నుండి వేరొక బూత్ లోకి మార్చుకోవాలన్నా ఫామ్ -8  నింపి,కుటుంబంలోని వ్యక్తులందరూ ఒకే బూత్ లో ఉండే విధంగా చూసుకోవాలని, ఇంకా ఎన్యుమరేషన్ ఫామ్ అందనివారు, మీ బూత్  బి ఎల్ వో లు లను కలిసి, ఫామ్ తీసుకొని తప్పకుండా నింపి ఇవ్వాలన్నారు.