17 April, 2026 | 12:22 PM

కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్

17-04-2026 11:15 AM

న్యూఢిల్లీ: మహిళల రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై(Delimitation Bills) లోక్ సభలో శుక్రవారం ఓటింగ్ జరగనుంది. మూడు బిల్లులపై సాయంత్రం 4 గంటలకు లోక్ సభలో ఓటింగ్ ప్రారంభం కానుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. డీలిమిటేషన్ బిల్లులకు సాధారణ మెజారిటీయే అవసరం అన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింటి రెండొంతుల మెజారిటీ అవసరం అన్నారు. బిల్లు ఆమోదానికి ప్రస్తుతం లోక్ సభ(Lok Sabha) సభ్యుల్లో 2/3 మోజారిటీ అవసరం. బిల్లు ఆమోదానికి లోక్ సభలో 360 మంది సభ్యల మద్దతు అవసరం. అధికారిక ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉంది.

సభకు హాజరైన సభ్యుల్లో 2/3వ వంతు మోజారిటీ సాధిస్తూ చాలు బిల్లు పాస్ అవుతోంది. ప్రతిపక్ష సభ్యులు ఎక్కువ మంది గైర్హాజరైతే సభలో అధికార పక్షానికి బలం చేకూరుతోంది. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని విపక్షాలు వెల్లడించాయి. డీలిమిటేషన్ బిల్లుపై ఇవాళ పూర్తి వివరాలు వెల్లడిస్తామని అమిత్ షా( Amit Shah) చెబుతున్నారు. 50 శాతం పెంపుతో లోక్ సభ సీట్లు 816కు పెరగనున్నాయి. లోక్ సభ సీట్లు తెలంగాణలో 26కు, తమిళనాడులో 59 కు పెరగనున్నాయి. డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్షాలు(Opposition) దుష్ప్రచారం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. డీలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల బలం పెరుగుతుందని అమిత్ షా వివరించారు.