వీఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేయాలి
- 3,797 మందికి నియామక పత్రాలు ఇవ్వాలి
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్
- ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన: ఆర్ కృష్ణయ్య
- ఇందిరా పార్క్ వద్ద వీఆర్‌ఏల ధర్నా
ముషీరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): వీఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేసి, 3,797 మందికి నియామక పత్రాలు ఇవ్వాలని టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిగిలిన 3,797 మంది గ్రామ రెవెన్యూ అసిస్టెం ్లకు జీఓ నంబర్ 81, 85 ప్రకారం ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద వీఆర్‌ఏ వారసుల జేఏసీ అధ్యక్షుడు ఆంజనేయులు, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ముదిరాజ్ అధ్యక్షతన వీఆర్‌ఏ వారసుల భారీ ధర్నా నిర్వహించారు.
ధర్నాకు తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేలాది కుటుంబాలు ఉద్యోగ భద్రత కోసం పోరాడుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న చాలా ధర్నాల్లో వెనుకబడిన వర్గాల ప్రజలే ఉండటం వల్లనే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించారు. 3,797 మం ది వీఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేసి నియామక పత్రాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశా రు.
నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వా రా సర్వే నంబర్లు, భూ హద్దులు తెలుసుకుంటున్నప్పటికీ గతంలో గ్రామాల్లో భూముల వివరాలు తెలుసుకోవాలంటే వీఆర్‌ఏలే దిక్కు అని, నోటి మాటతో చెప్పేంత అవగాహన వారికుందని పేర్కొన్నారు. ఎన్నో సంవ త్సరాలుగా గ్రామాల పరిపాలనలో పనిచేసిన ఈ సిబ్బందిని నిర్లక్ష్యం చేయడం తగద న్నారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ సమస్యపై వెంటనే స్పందిం చి న్యాయం చేయాలని మల్లన్న డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం పోరాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న వీఆర్‌ఏల కుటుంబాల ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు.
వీఆర్‌ఏ వారసులు నిరుద్యోగులే: ఆర్ కృష్ణయ్య
వీఆర్‌ఏ వారసులు కూడా నిరుద్యోగులే కదా, వీరికి ఉద్యోగాలు ఇవ్వడం వలన నిరుద్యోగుల భారం తగ్గుతుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. జీవో 81, 85 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,555 మందిలో డిగ్రీ చదివిన వారిని జూనియర్ అసిస్టెంట్స్, ఇంటర్ చదివిన వారిని రికార్డ్ అసిస్టెంట్స్, పదవ తరగతి లోపు చదివిన వారిని ఆఫీస్ సబార్డినేటర్స్, రెవెన్యూ శాఖ తోపాటు, మున్సిపల్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, విద్య వైద్య తదితర శాఖలో ఉన్న ఖాళీలో 16,750 మంది ప్రభుత్వం సర్దుబాటు చేసిందన్నారు.
మిగిలిన 3,797 మంది వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా ప్రభుత్వం గత 15 నెలలు గా కాలయాపన చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఈ సమస్య పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రైవేట్ రంగం ఐటి తదితర ఉద్యోగాలతో పాటుగా ప్రభుత్వ అన్ని శాఖలలో ముఖ్యంగా విద్యా, వైద్యం రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలని కోరారు.




