20 ఏళ్లుగా ఎదురుచూపులు
ఎన్నికల హామీగా నానుతున్న దోమకొండ డిగ్రీ కళాశాల
- పేద విద్యార్థులకు అందని ద్రాక్షల డిగ్రీ విద్య
- లోగడ వందరోజులపాటు రిలే దీక్షలు.. మద్దతునిచ్చిన రఘునందన్, కోదండరాం
- పదవులు రావడంతో నేతల మౌనం
- కాలేజీ కోసం మరోమారు ప్రజాసంఘాల సన్నాహాలు
దోమకొండ, సెప్టెంబర్ ౮ (విజయక్రాం తి): పాత తాలూకా కేంద్రమైన దోమకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College) కోసం రెండు దశాబ్దాలుగా విద్యార్థులు తల్లిదండ్రులు ఎ దురుచూస్తున్నారు. దోమకొండలో డిగ్రీ క ళాశాల స్థాపన అందని ద్రాక్ష పండులా మిగిలిందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపో తున్నారు. గతంలో డిగ్రీ కళాశాల కోసం 100 రోజుల రిలే నిరాహార దీక్ష లు చేపట్టిన నాయకులు పదవులు రాగానే మౌనవ్రతం కొనసాగిస్తున్నారు.
డిగ్రీ కళాశాల కోసం చేపట్టిన ఆందోళనలో ప్రస్తుత మెదక్ ఎంపీ ర ఘునందన్ రావు, ప్రభుత్వ అడ్వైజర్ షబ్బీర్, ఎమ్మెల్సీ కోదండరాం ఇత ర అనేక నేతలు పాల్గొన్నారు. ప్రస్తుతం మరో మారు దోమకొండ వా సులు డిగ్రీ కళాశాల సాధ న కోసం పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలైనా రాగా నే దోమకొండలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని అరచేతిలో వైకుంఠం స్వర్గం పార్టీల నేతలు చూపుతున్నారు.
దోమకొండ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని 20 సంవత్సరాల ను ండి పోరాటాలు చేశారు నిరీక్షణ చేస్తునా ్నరు.ఎన్నికల సమయంలో హామీగా డిగ్రీ కళాశాల సమస్య మిగిలిపోయింది. పేద వి ద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ విద్య అందని ద్రాక్ష పండులా ఊరిస్తున్నది.గత ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని విద్యార్థులకు నాణ్యమై న విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.
20 సంవత్సరాల నుండి దో మకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పా టు చేయాలన్న డిమాండ్ కొనసాగుతుంది యువత విద్యార్థులు తల్లిదండ్రులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు డిగ్రీ కళాశాల మంజూరు చేయడం లేదు పేద విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ విద్య అందడం లేదు. దోమకొండ, బీబీ పేట బిక్కన ూరు పాల్వంచ మాచారెడ్డి చుట్టుపక్కల ప్రాం తాల్లో విద్యార్థులకు దోమకొండ కీలక విద్యా కేంద్రంగా ఉంది.
ఈ ప్రాంతంలో బీడీ పరిశ్రమపై ఆధారపడే కుటుంబాలు అధికంగా ఉండటంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు అత్యవసరమని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందడం లేదని,ప్రైవేట్ కళాశాలల్లో చదువుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ అనంతరం చదువును కొనసాగించలేకపోతున్నారు.
ముఖ్యంగా బీడీ కార్మికులు, వ్యవసాయ కూలీల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.ప్రతి ఏడాది గణనీయ సంఖ్యలో విద్యార్థులు చదువు మానేస్తున్నారని, వారిలో ఎక్కువ మంది బీడీ కార్మికుల పిల్లలే ఉన్నరు . ప్రైవేట్ విద్య ఖర్చులు , ఫీజులు ఆర్థిక వారం భరించలేక చాలామంది విద్యను మధ్యలోనే నిలిపివేస్తున్నారు.దోమకొండ మండలంలోని రవాణా సౌకర్యాల కొరత సమస్య తీవ్రంగా ఉన్నది.
విద్యార్థులు డిగ్రీ చదువుల కోసం కామారెడ్డి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది, తగిన రవాణా సౌకర్యాలు, ఆర్టీసీ బస్సులు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. రద్దీ సమయాల్లో బస్సులు కిక్కిరిసిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఏటా దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందు తున్నారు.ప్రతి ఏడాది వందల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నారు.
దోమకొండ, బీబీపేట ప్రాంతాల్లోని ఇతర కళాశాలల నుంచి మరో 300 మందికి పైగా విద్యార్థులు ఉన్నత విద్యకు అర్హత సాధిస్తున్నారు. వీరిలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు అధికంగా ఉన్నారు.దోమకొండలో డిగ్రీ కళాశాల ఏర్పాటుపై ప్రజా సంఘాలు తల్లిదండ్రులు వందరోజుల రిలే నిరాహార దీక్ష చేయడంతో ప్రభుత్వ కమిటీ పరిశీలన చేస్తున్నట్లు అప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు.
డిగ్రీ కళాశాలకు శాశ్వత భవన వసతులుఏర్పాటు అయ్యే వరకు జూనియర్ కళాశాల భవనంలో కొంత స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అప్పటి కమిటీకి తెలిపారని సమాచారం, ఇప్పటివరకు డిగ్రీ కళాశాల పై ఎలాంటి పురోగతి కనిపించలేదు.విద్యార్థుల భవిష్యత్ కోసం కళాశాల ఏర్పాటు చేయాలి.
దోమకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే మండలంతో పాటు పరిసర మండలాల విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను కొనసాగించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి దోమకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని దోమకొండ మండల కేంద్రం ప్రజలు విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు తెలిపారు.
దోమకొండ.. విద్యలో వెనుకబడిన మండలం
చాలా మంది బీడీలు చేస్తూ జీవనాధారం. పేద,మధ్య తరగతి ప్రజలు కామారెడ్డి కి దూరంగా ఉండడం వాళ్ళ అమ్మయిలను పంపుట లేదు ఇంటర్ తోనే ఆపేస్తున్నారు. పూర్వపు సమితి, మరియ పాత తాలూకా చరీత్రక ప్రదేశం అయిన దోమకొండలో నేటికి డిగ్రీ కాలేజి లేకపోవడం బాధాకరం. డిగ్రీ కాలేజ్ వస్తే బీబీపేట్ నుంచి దోమకొండ ప్రజలకు అనుగుణంగా ఉంటుంది.
ఉమాశేష రావు, కవి, రచయిత
బీడీ కార్మిక ప్రాంతంలో డిగ్రీ కాలేజీ అవసరం
అత్యధికంగా బీడీ కార్మికులు శివ కార్మికులు పేదలు నివసించే దోమకొండ చారిత్రక ప్రదేశం. వెయ్యి ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థాన ప్రాంతంలో డిగ్రీ కాలేజీ లేకపోవడం బాధాకరం. గత పాలకుల నిర్లక్ష్యంతో విద్యాభివృద్ధి నేర్చుకోలేదు.
బోడపుంటి తిరుపతి, రిటైర్డ్ హెడ్మాస్టర్, దోమకొండ