రాజ్యసభ నుంచి విపక్ష నేతల వాకౌట్
03-07-2024 12:50 PM
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. రాజ్యసభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి విపక్ష నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపై తీర్మానంపై ప్రధాని సమధానం ఇస్తున్నారు. పరాజయంతో కాంగ్రెస్ నేతలు అన్య మనస్కంగా ఉన్నారని ప్రధాని ఆరోపించారు. దేశ ప్రజల నిర్ణయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా సేవాభావంతో ఎన్డీయే ముందుకెళ్తోందని మోడీ తెలిపారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వంగా ఉందన్నారు. దేశానికి సేవ చేసేవారినే ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. ఎన్డేయే పాలనను దేశ ప్రజలు మరోసారి సమర్థించారని వెల్లడించారు.






