16 July, 2026 | 6:40 PM

దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుస్తాం: ప్రధాని

03-07-2024 01:06 PM

న్యూఢిల్లీ: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపై తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ సమధానం ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ఆర్థిక వృద్ధిలో భారత్ ను పది నుంచి ఐదో స్థానానికి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధిలో భారత్ ను మూడో స్థానానికి తీసుకువస్తామని పేర్కొన్నారు. పదేళ్లలో చేసిన అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని సూచించారు. ప్రతిపక్షం హయాంలో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడిపిందని ప్రధాని ఆరోపించారు.

దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లు పేదరికానికి వ్యతిరేకంగా పోరాడుతామన్న ప్రధాని వచ్చే ఐదేళ్లలో పేదలకు అనుకూల నిర్ణయాలు ఉంటాయన్నారు. అభివృద్ది విస్తరణలో ప్రజలకు ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడించారు. టైర్-2, టైర్ -3 పట్టణాలు అభివృద్ధిలో భాగస్వాములవుతాయని ప్రధాని తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రజాతీర్పును కొందరు ఇష్టపడడం లేదన్న ప్రధాని మోడీ.. తమ విజయాన్ని చూసి కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందన్నారు. మూడోసారి ఎన్డీఏకు ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వపడుతున్నానని చెప్పిన నరేంద్ర మోడీ పదేళ్లుగా సేవాభావంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు