08-02-2026 12:00:00 AM
12వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ఠాకూర్ స్వాతి గణేష్ సింగ్
జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): ప్రజాసమస్యల ప్రశ్నించే గొం తుకనవుతానని 12వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ఠాకూర్ స్వాతి గణేష్ సింగ్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 12వ వార్డులో ఇంటింటికి తిరిగి కారుగుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. మహిళలు, యువత, రైతులు పార్టీలక తీతంగా ఆమెకు మద్దతు పలకడం విశేషం.ఈ సందర్భంగా స్వాతి గణేష్ సింగ్ మాట్లాడుతూ.. నన్ను ఆదరించి ఆశీర్వదిస్తే వార్డులో ఎండాకాలం వస్తే వాటర్ సమస్య తీవ్రంగా ఉంటుందని, సోంత డబ్బులతో అదనంగా వాటర్ ట్యాం క్ నిర్మించి బోరు ఏర్పాటు చేస్తాననిన్నారు. అమరవీరుల స్తూపం దగ్గర్లో మినీ బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తానన్నారు.
సీసీరోడ్లు, అండర్ డ్రైనేజీ, వీధి దీపాలు పెండింగ్ లేకుండా మారుస్తానని తెలిపారు. వార్డులో సీసీ రోడ్లు,సంపూర్ణంగా అండర్ డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు.కాంగ్రెస్ నేతల మోసపూరిత వాగ్దాలను నమ్మవద్దని కోరారు. మాజీ సీఎం చేపట్టి అమలు చేసిన రైతుబందు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారనే తప్ప కొత్తగా చేపట్టిన పథకాలు శూన్యమని తెలిపారు. మహిళలు నెలకు రూ.2500, ఫించన్ల పెంపు ఏమైందని ఆమె ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయ కులు, కార్యకర్తలు, వార్డులోని గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.