15 April, 2026 | 12:09 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నిరంతరం ప్రజలతోనే ఉంటా

08-02-2026 12:00 AM

గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

సుల్తానాబాద్ ౪వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బిరుదు రాధాకృష్ణ

సుల్తానాబాద్, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): స్వర్గీయ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడిగా నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడిగా సుల్తానాబాద్ మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న తనను పెద్ద మనసుతో ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బిరుదు రాధాకృష్ణ ఓటర్ దేవుళ్లను వేడుకుంటున్నారు,నాలుగో వార్డు పరిధిలోని ప్రతి వీధి, ప్రతి కుటుంబం వద్దకు చేరుకుంటూ ఈసారి అవకాశం కల్పించండి.. పాలకుడిగా కాదు.. సేవకుడిగాపెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో నిరంతరం ప్రజల్లో ఉంటూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సేవచేస్తానని తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు.

నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి , సంక్షేమం పట్ల అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు, గత మున్సిపల్ ఎన్నికల్లో మీరు చూపిన ఆదరణతో నా సతీమణి బిరుదు సమతకృష్ణ ఇదే వార్డులో కౌన్సిలర్ గా విజయం సాధించి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గాప్రజలకు సేవలందిస్తూ, అన్ని వర్గాల అభిమానాన్ని సంపాదించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఒక అవకాశం ఇచ్చి ఇంకో మెట్టు ఎక్కేలా మీరందరూ దీవించాలని బిరుదు రాధాకృష్ణ ప్రతి ఒక్క ఓటర్ దేవున్ని వేడుకుంటున్నారు.