5 June, 2026 | 2:31 AM

ప్రగతి ప్రణాళికలో వార్డుల వారీగా సభలు

05-06-2026 12:35 AM

నేరేడుచర్ల, జూన్ 4: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ పరిధిలోని అన్నీ వార్డులలో వార్డు సభలు నిర్వహించుటకు గాను, సూర్యాపేట జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అనుగుణంగా పురపాలక సంఘ పరిధిలో జూన్ 04, 06,08, మరియు 10 తేదీలలో వార్డు సభలు ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయంతో నిర్వహించుటలో భాగంగా గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 1,7,8 వార్డలన్నీ కలిపి మరియానంద స్కూల్ నందు వార్డు సభ నిర్వహించారు.

ఈ సందర్బంగా మున్సిపల్ కమిషనర్ సిహేచ్. నాగరాజు మాట్లాడుతు.. ఇంకుడు గుంతల నిర్మాణాలు, స్వచ్చ సర్వేక్షన్, తడి చెత్త -పొడి చెత్త వేరు చేయు విధానము వనమహోత్సవము, త్రాగు నీరు, రాబోయే వర్షా కాల దృష్ట్యా తీసుకోవలిసిన చర్యలు మరియు పట్టణ పరిశుబ్రత గురించి వివరించారు.ఈ కార్య క్రమంలో నేరేడుచర్ల మున్సిపాలిటీ వైస్ చై ర్మన్ సందీప్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది, రిసోర్స్ పర్సన్లు మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.