13 June, 2026 | 1:57 PM

Breaking News

అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •  

ముద్రణకు ముందే నవరనే లీక్?

14-02-2026 12:00 AM
  1. ఢిల్లీ పోలీసుల అనుమానం

పుస్తకం పీడీఎఫ్ ఫైళ్లలో పబ్లిషర్ పేరు ఖాళీగా ఉందని గుర్తింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి13: భారత ఆర్మీ మాజీ చీఫ్ నవరణే ఆత్మకథ ’ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టి నీ’ పుస్తకం ప్రచురణకు ముందే లీక్ అయిం దా? అంటే అవుననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. ఢిల్లీ ప్రత్యేక సెల్ పోలీసులు. ఈ వివాదంపై పబ్లిషర్ పెంగ్విన్ ఇండియా సిబ్బందిని ఢిల్లీ స్పెషల్ సెల్ విచారించి ఇదే విషయాన్ని గుర్తించినట్లు తెలిసింది.

ఆ పుస్తకం, దాని డిజిటల్ ఫైళ్లను ఎలా భద్రపరిచారనే దానిపై సంస్థ నుంచి దర్యాప్తు అధికారులు వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. పుస్తకం విడుదలకు ముందే దానికి సంబంధించి బయటకు వచ్చిన పీడీఎఫ్ వెర్షన్ గురించి ప్రశ్నించారు.

విచారణ సమయం లో అందుబాటులో ఉన్న పీడీఎఫ్ పైళ్లను పరిశీలించగా ప్రింట్‌చేసిన వారి పేరు ఖాళీ గా ఉండటాన్ని గుర్తించారు. దీంతో పుస్తకం ముద్రణ జరపడానికి ముందే లీక్ అయి ఉండవచ్చని దర్యా ప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. పీడీఎఫ్ ఫైల్స్ పూర్తి వివరాలు ఇవ్వాలని సంస్థను కోరగా సమ యం కోరినట్లు సమాచారం.