25 July, 2026 | 9:02 PM

తొలి ఏకాదశి... దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

25-07-2026 08:28 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవుళ్ళ వద్ద  అర్చన, అభిషేకం, పూలు, పండ్లు, తమలపాకులు సమర్పించి పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున దేవుళ్లను  దర్శించుకున్నారు. సుల్తానాబాద్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాలలో ను ప్రజలు తొలి ఏకాదశి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు, దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.