20-02-2026 06:11:29 PM
– మండేపల్లిలో ఏపీడి నరసింహులు
తంగళ్ళపల్లి,(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో పిడర్ ఛానల్ కాలువల పుడికతీత పనులను ఏపీడి నరసింహులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువలు ఎలాంటి కబ్జాలకు గురికాకుండా ప్రతి పనిని నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
గ్రామంలోని చెరువుల నుంచి నీరు సక్రమంగా కాలువల ద్వారా సాగునీటిగా రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాలువలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారా వ్యవసాయానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనులను ముందుగానే గుర్తించి ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గాధగోని సాగర్, ఉపసర్పంచ్ యాస సందీప్, జడల ఆనంద్, సింగం శశి, కడారి రాంరెడ్డి, ధర్మారెడ్డి ప్రశాంత్, బాల్ రెడ్డి, గ్రామ కార్యదర్శి ముదం ప్రశాంత్, టెక్నికల్ అసిస్టెంట్ రాజనర్సు, సుష్మ, ఫీల్డ్ అసిస్టెంట్ దేవయ్యతో పాటు ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.