calender_icon.png 20 February, 2026 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొడ్రాయి వద్దే బస్సులు అగును

20-02-2026 06:08:23 PM

  • రింగ్ రోడ్డు వద్ద రిక్వెస్ట్ స్టాప్
  • కోదురుపాక సర్పంచ్ డా. కత్తెరపాక మంజుల సుధాకర్

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం, కోదురుపాక వద బొడ్రాయి వద్ద పెర్మనెంట్ బస్సు స్టాప్ కోసం అధికారులు చర్యలు చెప్పట్టారు. అందులో భాగంగా శుక్రవారం సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో నేడు బొడ్రాయి వద్ద తనిఖీలు చేపట్టారు. బొడ్రాయి వద్ద బస్సులు ఆపకుంటే సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ 9063152130 గారికి కాల్ చేయాలనీ కోరారు.

ఈ సందర్బంగా కోదురుపాక సర్పంచ్ డా.కత్తెరపాక మంజుల సుధాకర్ మాట్లాడుతూ... బొడ్రాయి వద్ద ఇప్పటి నుండి పేర్మినెంట్ బస్సులు ఆపేందుకు చర్యలు తీసుకుంటున్న ఆర్టీసీ ఆదికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలానే రింగురోడ్డు వద్ద రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. ఇతర గ్రామాల వారికోసం ఆటో స్టాండ్ కూడా బొడ్రాయి వద్ద ఏర్పాటుకీ సహకరిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలొ కత్తెరపాక సుధాకర్, సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు, సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మరియు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.