కేసీఆర్ తప్పుల వల్లే నీటి తిప్పలు

08-09-2026 | 05:30am
  1. కాళేశ్వరానికి ప్రజలను తీసుకెళ్లి ఏం చూపిస్తారు? 
  2. బీఆర్‌ఎస్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపాటు

హైదరాబాద్, సెప్టెంబర్  7 (విజయక్రాంతి) : తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం నెలకొన్న నీటి సమస్య(Water problem)కు ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న ఎల్ నినో వాతావరణ(El Nino weather) పరిస్థితులు కారణమైతే, మరోవైపు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ(BRS government) హయాంలో సాగునీటి రంగం(Irrigation Sector)లో చోటుచేసుకున్న వైఫల్యాలు ప్రధాన కారణమని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. గత ప్రభుత్వ అసమర్థ సాగునీటి విధానాలు తోడవడంతోనే రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చిందని, అందుకు కేసీఆరే కారణమన్నారు.

సోమవారం అసెంబ్లీ(Assembly) లాబీల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై భారీ జనసమీకరణకు కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) సిద్ధమవుతున్నారనే ప్రచారాన్ని మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పిల్లర్లు కుంగిపోయి, ప్రాజెక్టు నిర్మాణ భద్రతే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో అక్కడికి ప్రజలను తీసుకెళ్లి ఏం చూపిస్తారని మంత్రి  ప్రశ్నించారు. మీ ప్రభుత్వ హయాంలో రూపకల్పన చేసి, నిర్మించిన ప్రాజెక్టు దెబ్బతిన్న దృశ్యాలను చూపించడానికే ప్రజలను తీసుకెళ్తారా..? అని మంత్రి ప్రశ్నించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో బీఆర్‌ఎస్ నాయకత్వం ముందుగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  నిపుణుల పరిశీలనల్లో కాళేశ్వరం బ్యారేజీల పునాదులు, నిర్మాణ వ్యవస్థలకు సంబంధించి తీవ్రమైన లోపాలు వెలుగుచూశాయని తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ నిపుణుల సలహాలతో డయాఫ్రం వాల్స్, స్టిల్లింగ్ బేసిన్ వ్యవస్థల మెరుగుదలతోపాటు దీర్ఘకాలిక భద్రతకు అవసరమైన పునరుద్ధరణ చర్యలను ప్రభుత్వం రూపొందిస్తోందన్నారు. 

2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రాణహిత-చేవెళ్ల, జూరాల ఆధారిత పాలమూరు-- రంగారెడ్డి పథకాలతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, ఎస్‌ఎల్బీసీ, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను ఎంతో తక్కువ వ్యయంతో పూర్తి చేసి ఉండేవారమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆం ధ్ర ప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణల ను మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. తా ను తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారినని స్పష్టం చేశారు.

నీటిపారుదల శాఖ కు ఎలాంటి నిపుణుల సేవలు అవసరమో మంత్రిగా తానే నిర్ణయిస్తానని పేర్కొన్నారు.  తెలంగాణ రాజకీయాల్లో భాషా ప్రమాణా లు దిగజారడానికి కేసీఆరే కారణమని మం త్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించా రు. కేసీఆర్‌కు ముందు రాజకీయ నాయకులు ఈ తరహా భాషను ఉపయోగించేవా రు కాదని,  ఒకప్పుడు వీరత్వంగా ప్రచారం చేసుకున్న మాటలే ఇప్పుడు రాజకీయ సం భాషణను కలుషితం చేశాయి అని పేర్కొన్నారు.  

బీఆర్‌ఎస్ పూర్తి చేయలేదు.. 

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సాగునీటి రంగంపై సుమారు రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకున్నప్పటికీ, రాష్ట్ర ఆవిర్భావ సమయానికి పెండింగ్‌లో  ఉన్న ప్రధాన ప్రాజెక్టులలో ఒక్కదానినీ సంపూర్ణంగా పూర్తి చేయలేదని మంత్రి విమర్శించా రు.   పాలమూరు-- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై  రూ.27,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, పంట పొలాలకు నీటిని చేర్చే డిస్ట్రిబ్యూటరీ కాలువల వ్యవస్థను నిర్మించలేదని, 90 శాతం పూర్తి చేశామని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు.   

జూరాల పూర్తిగా తెలంగాణ భూభాగంలో ఉన్న ప్రాజెక్టు కాగా, శ్రీశైలం తెలంగాణ-, ఆంధ్రప్రదేశ్ జల సంబంధాల్లో ఉమ్మడి జలాశయమని గుర్తుచేశారు.  డిండి, గౌరవెల్లి, సీతారామ ప్రాజెక్టులకు సంబంధించిన కీలక అనుమతులు, ప్రధాన పనులను పరిష్కరించలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిండి ప్రాజెక్టు నీటి వనరును ఖరారు చేయడంతోపాటు, పనులను ముందుకు తీసుకెళ్లేందుకు సుమారు రూ.1,800 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

కృష్ణా, గోదావరి నదీజలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా కోసం జల వివాదాల ట్రిబ్యునళ్లు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సహా ప్రతి సమర్థ వేదికపైనా ప్రభుత్వం రాజీలేని పోరాటం కొన సాగిస్తోందన్నారు. రాబోయే వేసవిలో సాగునీరు, తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బ ందులు తలెత్తకుండా అందుబాటులో ఉన్న జలాశయ నిల్వలను అత్యంత శాస్త్రీయంగా, జాగ్రత్తగా పరిరక్షిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు