చిత్ర విజయంతో వివాదానికి శుభం కార్డు పడిందని భావిస్తున్నాం
వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్‌చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన హారర్- యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’. బాలకృష్ణ మహారాణా నిర్మించారు. డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకు మార్ మాట్లా డుతూ.. “వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొ నలేదని చిత్రయూనిట్ ఆరోపణలు చేసింది.
వరలక్ష్మి ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ను సంప్రదించటం తో దర్శకుడు సంజీవ్ తన తప్పు లేకున్నా ఆమెకు సారీ చెప్పారు. ఆయన వినయం, సహనమే ఈ చిత్ర విజ యానికి మరో కారణం” అన్నారు. చిత్ర దర్శకుడు సం జీవ్ మాట్లాడుతూ.. “మా చిత్ర హీరోయిన్ వర లక్ష్మిశ రత్‌కుమార్ నాలెడ్జ్ కంటే మా నాలెడ్జ్ లక్ష రేట్లు ఎక్కు వ ఉంది. అందుకే ప్రసన్నకుమార్ వంటి పెద్దల సూచ న మేరకే ఆమెకు సారీ చెప్పాం. సమస్య పూర్తిగా సర్దు మణగలేదు.
మొత్తానికి ఒక వివాదంతో సతమత మ య్యాం.. చివరికి విజయంతో శుభం కార్డు పడిందని భావిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రా ల్లో విడుదలైన ‘పోలీస్ కంప్లైంట్’కు అద్భుత మైన స్పందన వస్తోంది” అని తెలిపారు. ‘సినిమాకు ప్రేక్షకు ల నుంచి వస్తున్న ఆదరణ ఆనందాన్ని కలిగి స్తోంద’ని హీరో కృష్ణసాయి చెప్పారు. నటులు జెమినీ సురేశ్, విజయభాస్కర్, నిర్మాత ఘంటా శ్రీనివాస్, డిస్ట్రిబ్యూ టర్ రాఘవేంద్రరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






