ఐలమ్మ పోరాటం మరువలేం

26-09-2026 | 09:46pm

* ముస్తాబాద్ లో ఐలమ్మ జయంతి వేడుకలు 

* ఘనంగా నిర్వహించిన రజక సంఘం సభ్యులు 

ముస్తాబాద్,సెప్టెంబర్ 26( విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ(Chakali Ilamma) 131వ జయంతి వేడుకలు రజక సంఘo(Rajaka Association) మండల అధ్యక్షుడు సుద్దాల దేవయ్య ఆధ్వర్యంలో  నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరాట(Telangana Armed Struggle) యోధురాలు,వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలకు గ్రామ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, స్థానిక ఎస్సై జ్యోతి  రజక సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

భూమి కోసం,భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను,పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వీరవనిత చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు.కుల మతాలకు,రాజకీయాలకు అతీతంగా మహనీయులను స్మరించుకోవాలని సూచించారు.రజకుల సంక్షేమానికి పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం సభ్యులు వివిధ పార్టీల నాయకులు బాల్ రెడ్డి,అంజిరెడ్డి, మల్లేష్ శ్రీనివాస్,రమేష్,బాలయ్య, నరసింహారెడ్డి,శ్రీనివాస్,శేరయ్య, నర్సింలు,బాలయ్య వివిధ గ్రామాల రజక సంఘం అధ్యక్షులు వివిధ కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు