మొక్కలు నాటి.. వాటిని సంరక్షించాలి
మజీద్ పూర్ సర్పంచ్ మేడిపల్లి ప్రియ చంద్రశేఖర్
అబ్దుల్లాపూర్ మెట్, జులై 29: మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని మజీద్ పూర్ సర్పంచ్ మేడిపల్లి ప్రియా చంద్రశేఖర్ అన్నారు. గ్రామంలో బుధవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సెక్రెటరీ తదితరులతో కలిసి ఘనంగా ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంపొందించడానికి..
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకుని విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ‘మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా వారి బాధ్యతే నాని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను నాటి పెంచాలి‘ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు శివకుమార్, నవనీత, నరసింహ, లావణ్య, కార్యదర్శి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.






