calender_icon.png 19 December, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సమస్యలకు అండగా ఉండి పోరాడాలి

19-12-2025 12:59:43 AM

నిజామాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): నీటిపారుదల శాఖ నిజామాబాద్ జిల్లా ఉద్యోగులను అభినందించి భవిష్యత్తులో టీఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల కు మద్దతుగా నిలిచి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అండగా ఉండాలని నాశెట్టి సుమన్ అన్నారు.

జిల్లా కేంద్రంలోని టిఎన్జీవో జిల్లా కార్యాలయం నందు స్వర్గీయ బి స్వామినాథం సమావేశం హాల్లో నీటిపారుదల శాఖ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్వామి, సునీత ల అధ్యక్షతన ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్  టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నెత్తికుంట శేఖర్,

నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం అడక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్  లక్ష్మణరావు రాష్ట్ర కో కన్వీనర్ నజీర్ అహ్మద్, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరవగా... టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు సంబంధిత శాఖ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ 2025 26 సంవత్సరానికి గాను నీటి పారుదల శాఖ ఉద్యోగుల ఐక్యతను అభినందిస్తూ ఉద్యోగస్తుల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం వెంట రావాలని, త్వరలో టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్,

ఎస్ ఎం హుసేని ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిర్వహించబోయే ఉద్యమ కార్యచరణకు తామందరూ కలిసికట్టుగా రావాలని కోరారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం 2025 26 సంవత్సరానికి గాను నిర్వహించే జిల్లా ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన టీఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్ మాట్లాడుతూ నీటి పారుదల శాఖ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో

ఎన్నికల గాను అన్ని పదవులకు సింగిల్ సెట్ నామినేషన్ వచ్చినందున అన్ని పదవులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులుగా కే జనార్దన్ జిల్లా కార్యదర్శిగా సామ్యూల్ వెస్లీ కోశాధికారిగా ఇక్బాల్ సహాధ్యక్షులుగా శ్రీనివాస్ మోరే ఉపాధ్యక్షులుగా వెంకటరమణారెడ్డి జగన్మోహన్ వసంత సంయుక్త కార్యదర్శిగా సంపత్ మల్లయ్య సమంత ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి జయరాజ్ ప్రచార కార్యదర్శిగా జి శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులుగా అజీమ్ ఆశయ చిన్న గంగారం చెన్న శివరాజ్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించారు.