19-12-2025 01:02:28 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలో కలకలం రేగింది. ఈఎస్‌ఐ ఆసుపత్రి సమీపంలోని ఎస్పీఎం క్వార్టర్స్ ప్రాంతంలో భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నివాస ప్రాంతంలో కొండచిలువ సంచరిస్తున్న దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులు స్పందించి ధైర్యంగా, చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు.అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారి సూచనల మేరకు ఆ కొండచిలువను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు. ఈ ఘటనతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.