5 June, 2026 | 6:55 PM

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

05-06-2026 06:13 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మూకమామిడి సర్పంచ్ కొర్సా ఆదిలక్ష్మి, సీతారాంపురం సర్పంచ్ కుంజా రవి  కోరారు. ములకలపల్లి మండలం మూకమామిడి, సీతారాంపురం గ్రామపంచాయతీల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ... ప్రతి ఒక్క జీవి జీవనానికి పర్యావరణమే ఆధారమని ప్రకృతిని కాపాడేందుకు అందరూ కట్టుబడి ఉండాలని, స్వచ్ఛమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మనిషి మనుగడకు, జీవనానికి పరిశుభ్రమైన గాలి,స్వచ్ఛమైన నీరు, పచ్చని చెట్లు ఎంతో అవసరం కానీ కాలుష్యం,ప్లాస్టిక్ వ్యర్ధాలు,అడవుల నరికివేత వల్ల పర్యావరణం కలుషితమవుతుందన్నారు.గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని,ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు.అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పంచాయతీ ఆవరణంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి సునేష్, కందుకూరి రాంబాబు,అంగన్వాడీ కార్యకర్తలు,హెల్త్ వర్కర్లతో కలిసి మొక్కలు నాటారు.