28 July, 2026 | 1:16 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

05-06-2026 06:18 PM

ముకరంపుర,(విజయక్రాంతి): బిజెపి పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్రెడ్డి రేకుర్తి ఐ హాస్పిటల్ బైపాస్ రోడ్డు మధ్యలో మొక్కలు నాటారు. దేశ ప్రధాని  నరేంద్ర మోడీ  సుపరిపాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ప్రతి బూతులో రెండు మొక్కలు నాటే కార్యక్రమం రేకుర్తి 40వ బూత్ అధ్యక్షుడు ఏం లక్ష్మి రాజ్యం ఆధ్వర్యంలో  జోన్ కన్వీనర్ జాడి బాల్రెడ్డి బిజెపి నాయకులు బుద్ధ శ్రీనివాస్ హాజరై మొక్కలు నాటారు.

అనంతరం జాడి బాల్రెడ్డి మాట్లాడుతూ... పశ్చిమ జోన్ 60 బూతుల అధ్యక్షులు బిఎల్ఎలు వారి  బూతు పరిధి కాలనీలో మొక్కలు నాటారని , మొక్కల పెంపకం వలన పర్యావరణాన్ని  కాపాడుదామని, వర్షాలు కురవడం కాలుష్యాన్ని నియంత్రణ అలాగే మానవులు పీల్చుకునే గాలి కాలుష్య రహితంగా ఉంటుందని అన్నారు. నరేంద్ర మోడీ పర్యావరణం పైన ప్రత్యేక దిష్టిపెట్టారని కావున మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షించుదాం అన్నారు. కార్యక్రమంలో భూత్ అధ్యక్షులు గోదారి నరేష్, ముసవాడ రాహుల్, బండి రాకేష్ ,తదితరులు పాల్గొన్నారు.