calender_icon.png 25 July, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి..

24-07-2025 12:35:10 AM

  1. రేవంత్ సర్కార్ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

ధరూర్ మండల స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశం

గద్వాల నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు 

గద్వాల, జూలై 23 ( విజయక్రాంతి ) : గతంలో కెసిఆర్ పాలనలో అమలైన పథకా లు, గ్రామాలలో అభివృద్ధి ప్రతి ఒక్కరు గు ర్తించుకోవాలి అని బాసు హనుమంతు నా యుడు అన్నారు. బుధవారం ధరూర్ మం డల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సం దర్భంగా నిర్వహించిన బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక  సమావేశానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ముందు గా మండల పరిధిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, బిఆర్‌ఎస్ పార్టీ జెండా ను ఆవిష్కరించారు. గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎ న్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించే లా కృషి చేయాలన్నారు. గత కేసీఆర్ ప్రభు త్వం హాయంలో చేసిన అభివృద్ధి ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ హాయంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అ మలు చేయడంలో విఫలమైందని, గ్రామా ల్లో చర్చ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. వార్డు మెంబర్ నుం డి ఎంపీపీ,జెడ్పీటీసీ వరకు బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్త కష్టపడి పని చేయాలని,పార్టీ గెలుపు కోసం కష్ట పడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉం టుందని తెలిపారు.

రెండు సంవత్సరాలు ఓ పిక పడితే కెసిఆర్ గారి ప్రభుత్వం వస్తుందని కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండాలన్నా రు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చక్రధర్ రావు, జి.రాఘ వేంద్ర రెడ్డి, మోనేష్, రాజారెడ్డి, వెంకటేష్ నాయుడు, తదితర నాయకులు,కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.