24-07-2025 12:35:46 AM
కాగజ్‌నగర్, జూలై 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో 10 ఏళ్లు అధికారంలో ఉండటం ఖాయమని, జీవో 49 ఎట్టి పరిస్థితుల్లో అమలు కాదని ఎమ్మెల్సీ దండే విట్టల విఠల్, మాజీ ఎంపీ సోయం బాపూరావు,డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు అన్నారు. బుధవారం కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆర్ జీవో అమలయితే తా నే మొదట రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ దండే విట్టల్ పేర్కొన్నారు.
ఈ జీవో బి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమ లుపై అన్ని పార్టీల నాయకులు ఒత్తిడి తెచ్చి అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్మ న్ గణపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గజ్జిరామయ్య, నాయకులు రమణయ్య, రాణా ప్రతాప్ సింగ్, షబ్బీర్ హుస్సేన్, శరత్ తదితరులు పాల్గొన్నారు.