24-07-2025 12:34:24 AM
సీనియర్ సివిల్ జడ్జ్ జి.రాధిక
నిర్మల్, జూలై 23 (విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఎంతో ఆర్థిక అభివృద్ధి చేకూర్చిందని ప్రభుత్వ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి.రాధిక అన్నారు గురువారం నిర్మల్ బస్టాండ్ లో ఆర్టీసీ మహాలక్ష్మి సంబరాలు పాల్గొన్నారు కార్పొరేషన్ మనది అంటే ప్రజలది దీనిని మనం ఉపయోగించుకోవాలి.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణం చేపట్టి ఈనాటికి 200 ల కోట్ల మహిళా ప్రయాణికులు ఉపయోగించుకున్నారు. సంస్థ కలిపించిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని సంస్థ అభివృద్ధికి అందరం సహకరించాలని ఆమె తెలిపారు. డిపోమేనేజర్ కే.పండరి మాట్లాడుతూ డిసంబర్ 2023 తేదీ 9 వ తేదీ నుండి కొనసాగుతున్న ఈ ఉచిత పథ కం మహిళా ప్రయాణికులు సద్వినియోగ పరచుకొని ఆర్టీసీ సిబ్బందికి సహకరించాల ని కోరారు. కార్యక్రమములో జిల్లా మహిళా సంఘ అధ్యక్షురాలు లక్ష్మి డిపో అసిస్టెంట్ మేనేజర్ దేవపాల పాల్గొన్నారు.