మలిదశ ఉద్యమానికి సిద్ధం కావాలి

14-09-2026 | 05:10am
  1. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
  2. ఎంపీ ఆర్ కృష్ణయ్య జన్మదిన వేడుకల్లో ‘బీసీల సింహనాదం’ గ్రంథావిష్కరణ

ముషీరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): హక్కులు, విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్ల సాధన కోసం మలిదశ ఉద్యమానికి బీసీలు సమాయత్తం కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం (National BC Welfare Association) ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం పిలుపునిచ్చారు. విద్యానగర్ బీసీ భవన్‌లో ఆదివారం రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలను ఘనం గా నిర్వహించారు. కేక్ కటింగ్, అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక రచయిత కడియాల సురేష్ కుమార్ రచించిన ‘బీసీల సింహనాదం ఆర్. కృష్ణయ్య జీవిత చరిత్ర’ గ్రంథాన్ని కృష్ణయ్య, ఆయన తనయుడు, సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్‌కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. ఐదు దశాబ్దాలుగా కృష్ణయ్య సాగించిన బీసీ ఉద్యమ ప్రస్థానం, విద్యా, సామాజిక, రాజకీయ చైతన్యం కోసం చేసిన పోరాటాలను గ్రం థంలో పొందుపరిచినట్లు తెలిపారు.

గుజ్జ సత్యం మాట్లాడుతూ.. బీసీలను రాజ్యాధికారం దిశగా నడిపించేందుకు ఐక్యంగా ఉద్యమించాలని కోరా రు. తన ఉద్యమ ప్రస్థానాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చిన కడియాల సురేష్‌కుమార్‌ను ఆర్. కృష్ణయ్య  అభినందించారు. ఈ కార్యక్రమంలో సీ రాజేందర్, జీఅనంతయ్య, పగిల్ల సతీష్ కుమార్, అంజి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు