calender_icon.png 16 February, 2026 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేస్తాం

16-02-2026 08:44:44 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు సోమవారం చిట్యాల మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని, మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచార నిమిత్తం తాను అన్ని వార్డులను తిరిగి వార్డులలో ఉన్న సమస్యలను గమనించానని వెంటనే వాటిని పరిష్కరించి మునిసిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.

ఎన్నికల వరకే రాజకీయాలని ఇప్పుడు తన ధ్యేయం అభివృద్ధి మాత్రమే అని అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ కుంట అభివృద్ధికి రెండు కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ కేటాయిస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి కౌన్సిలర్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించినందుకు నేను వార్డు కౌన్సిలర్లు పాలకవర్గ సభ్యులంతా కట్టుబడి పని చేస్తామని అన్నారు.

అనంతరం నూతన  చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, ఆర్యవైశ్య సంఘం చైర్మన్ సుజాత, కాంగ్రెస్ జిల్లా నాయకులు పోకల దేవదాస్, మాజి మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి,  ఎద్దులపురి కృష్ణ, పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, పాటి నర్సిరెడ్డి, పాటి మాధవరెడ్డి వనమా వెంకన్న, పందిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.