14 May, 2026 | 2:08 AM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజే పీతో కలిసి పోటీ చేస్తాం

14-05-2026 01:15 AM

ఆర్పిఐ(ఎ) జాతీయ కార్యదర్శి పేరం నాగేశ్వర్‌రావు గౌడ్

ముషీరాబాద్, మే 13 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తుందని భారత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ- ఏ) జాతీయ కార్యద ర్శి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యక్షుడు పేరం నాగేశ్వరరావు గౌడ్ అన్నారు. అనుబంధ సంఘాల కమిటీలను జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఆదేశాల మేరకు రద్దు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో పార్టీ పటిష్టత కోసం వచ్చే జూన్ మొదటి వారంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో అథవాలే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నూతన కమిటిని ప్రకటిస్తారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి తమ పార్టీ పోటీ చేస్తుం దని తెలిపారు.

మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకువస్తే పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రానికి చెందిన 8 మంది లోక్‌సభ సభ్యులు వ్యతిరేకించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద ధ ర్నా చేపట్టామన్నారు. ఈ సమావేశంలో టి. రాజ్ కుమార్, బి. సాంబ, రాచారం శ్రీనివా స్, గడ్డ రవికుమార్ పాల్గొన్నారు.