25 July, 2026 | 2:41 AM

డ్రగ్స్ నియంత్రణకు చట్టం తెస్తాం

25-07-2026 01:34 AM
  1. విద్యా సంస్థల్లో దొరికితే యాజమాన్యాలే బాధ్యులు
  2. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించాలి
  3. ట్రాఫిక్ నిర్వహణకు బ్యూరో ఏర్పాటు 
  4. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
  5. ఉన్నతాధికారులతో సమీక్ష

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): డ్రగ్స్ నియంత్రణకు అవసరమైతే ప్రత్యేక చట్టం తెస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలనే బాధ్యులను చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన, భద్రత కమిటీలపై ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో డ్రగ్స్ దొరికితే ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేయాలని సూచించారు. రాష్ట్రం లో డ్రగ్స్ నియంత్రణకు నిబంధనలను మరిం త కఠినతరం చేస్తూ అవసరమైతే ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. విద్యా సంస్థలు విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకునేలా చూడాలని అన్నారు.

మాదక ద్రవ్యాలకు సం బం ధించి సమాచారం అందించేందుకు విద్యా సంస్థల ఆవరణలో టోల్‌ఫ్రీ నెంబర్, ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు చెప్పారు. డ్రగ్స్ తీసు కుని పట్టుబడితే డీ -అడిక్షన్ సెంటర్ పంపించడం, కౌన్సిలింగ్ ఇప్పించడమే కాకుండా తరచూ పట్టుబడితే కఠినంగా శిక్షించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. 

ట్రాఫిక్ నిర్వహణకు బ్యూరో ఏర్పాటు 

రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణకు, రోడ్డు భద్ర త పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక బ్యూరోను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రవాణా వ్యవస్థను సమ గ్రంగా అధ్యయనం చేసి ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసే బ్యూరోకు సంస్థాగత నిర్మాణం ఉండాలని చెప్పారు. తెలంగాణ ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియాన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ప్రతీ 2 లేదా 3 నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించా లని చెప్పారు. ట్రాఫిక్ వ్యవస్థలో నిబంధనలకన్నా క్రమబద్ధీకరణపై ఎక్కువ దృష్టి సారిం చాలని, వాతావరణంలో వచ్చే మార్పులు, కార్యాలయాల పనివేళలు, రద్దీ సమయాలు, స్థానిక సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు పటి ష్టం చేయాలని, ఓఆర్‌ఆర్‌పై ఇష్టానుసారంగా వాహనాలు నిలపకుండా నిరంతరం పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. నగరంలో స్మార్ట్ సిగ్నలింగ్ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పారు.

సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకురావడానికి అవసరమైన చోట అండర్ పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించాల్సిన అవసరం ఉందని, సాధ్యమైనంత వరకు సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా చూడా లని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డి, కే రామకృష్ణారావు, ఈగల్ తెలంగాణ డైరెక్టర్ సందీప్ శాండిల్య తదితరు లు పాల్గొన్నారు.