నూతన ‘కిసాన్ ఫ్యాషన్ మాల్’
- ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్స్‌లో ప్రారంభించిన హీరోయిన్ ప్రియాంక మోహన్
- ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా వ్యాపార దక్షత ప్రధాన బలం
- 1959 నుంచి నాణ్యత, విశ్వసనీయత, అందుబాటు ధరలకు ప్రతీక
నిజామాబాద్, జూలై 24 (విజయక్రాంతి): కుటుంబ సభ్యులందరికీ నాణ్యమై న, ట్రెండీ ఫ్యాషన్‌ను అందుబాటు ధరల్లో అందిస్తున్న సంస్థ కిసాన్ ఫ్యాషన్ మాల్ నూతన షోరూం హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్‌లో హీరోయిన్ ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభమైంది. హీరోయిన్ ప్రియాంక మోహన్‌తో పాటు సంస్థ యాజమాన్యం, పలువురు ప్రముఖులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పెద్ద సంఖ్యలో ఫ్యాష న్ అభిమానులు వినియోగదారులు కూడా హాజరయ్యారు. 1959లో స్థాపించబడిన కిసాన్ ఫ్యాషన్ మాల్, ఆరు దశాబ్దాలకు పైగా నాణ్యత, విశ్వసనీయత, అందుబాటు ధరలకు ప్రతీకగా నిలుస్తూ ఫ్యామిలీ ఫ్యాషన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.
చిన్న వ్యాపారంగా ప్రారంభమైన ఈ సంస్థ నేడు తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రముఖ రెడీమేడ్ వస్త్రాల రిటైల్ చైన్‌గా అభివృద్ధి చెందింది. నిజామాబాద్, మెదక్, నిర్మల్, లాతూర్, పర్భనీ, సుచిత్ర సెంటర్, బీరంగూడతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విజయవంతంగా శాఖలను నిర్వహిస్తోంది. కిసాన్ ఫ్యాషన్ మాల్ సంస్థకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా దూరదృష్టి, సమర్థ నాయకత్వం, వ్యాపార దక్షత ప్రధాన బలాలుగా నిలిచాయి.
ఆయన మార్గదర్శకత్వంలో కుటుంబ సభ్యులు కూడా సంస్థ నిర్వహణలో, రోజువారీ కార్యకలాపాల్లో చురుకుగా భాగస్వాములవుతూ, కిసాన్ ఫ్యాషన్ మాల్‌ను కుటుంబ విలువలను ఆధునిక రిటైల్ వ్యాపార విధానాలతో సమన్వయం చేసిన విశ్వసనీయ షాపింగ్ కేంద్రంగా తీర్చిదిద్దారు. కిసాన్ ఫ్యాషన్ మాల్‌లో పురుషులు, మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేక విభాగాలతో విస్తృత శ్రేణి వస్త్రాలు అందుబాటులో ఉంటాయి.
వివాహాలు, పండుగలు, శుభకార్యాలు, రోజువారీ వినియోగానికి అనువైన ఆధునిక, సంప్రదాయ వస్త్రా లను పోటీ ధరల్లో అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘ఏక్‌దమ్ ఫ్యాషన్’ అనే సంస్థ నినాదానికి అనుగుణంగా ఆధునిక ఫ్యాషన్, నాణ్యత, అందుబాటు ధరలను ఒకే వేదికపై అందిస్తూ కుటుంబాల కోసం సంపూర్ణ షాపింగ్ గమ్యస్థానంగా ఈ నూతన బ్రాం నిలవనుందని నిర్వాహకులు పేర్కొన్నారు.






