రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): రాబోయే ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తీరాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో పలు పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి గడపగడపకు వివరించాలని తెలిపారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందని అందుకే పార్టీలో చేరుతున్నట్లు పాలవురు పార్టీలోకి వచ్చిన వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్ గౌడ్, శంకర్ గౌడ్, వెంకట గౌడ్, రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామస్వామి గౌడ్, అంజా గౌడ్, చరణ్ గౌడ్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






