5 September, 2026 | 8:26 AM

సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం

05-09-2026 | 05:35am
  1. లక్షలాది మంది రైతులతో కదిలివస్తాం 
  2. అవసరమైతే సీఎం ఇంటినీ దిగ్బంధిస్తాం 
  3. నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించాల్సిందే 
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు

మంచిర్యాల/కుమ్రంభీం ఆసిఫాబాద్/కౌటాల, సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి): రైతుల పట్టా భూముల(farmers title lands)ను నిషేధిత జాబితా(Prohibited list)లో చేర్చి, వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిషేధిత జాబితా నుంచి రైతుల భూముల(farmers lands)ను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో లక్షలాది మంది రైతుల(Farmers)తో సెక్రటేరియట్‌(Secretariat)ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

అవసరమైతే సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఇంటిని కూడా దిగ్బంధిస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, మంచిర్యాల జిల్లా(Mancherial district) కేంద్రంలో నిర్వహించిన రైతు సదస్సు(farmers meeting)లో హరీశ్‌రావు(Harish Rao) మాట్లాడారు. కౌటా లలో మాట్లాడుతూ.. సిర్పూర్ నియోజకవర్గంలో 42,867 ఎకరాల భూము లను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చే ర్చారని విమర్శించారు.

‘భూములు ఇచ్చింది కేసీఆర్.. భూములు లాక్కుంది రేవంత్‌రెడ్డి’ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిషేధిత జాబితాలో భూములు ఉండటంతో రైతులకు రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు రుణాలు వంటి ప్రయోజనాలు అందక ఇ బ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నా రు. పంటను అమ్ముకునేందుకు కూడా భూ ముల వివరాలు అడ్డంకిగా మారుతున్నాయ ని చెప్పారు. ప్రభుత్వ తప్పిదాలకు రైతులను బాధ్యులుగా చేయడం ఏమిటని ప్రశ్నించారు.

పట్టా భూములను అసైన్డ్ భూములు గా మార్చడమే ఇందిరమ్మ రాజ్యమా అని నిలదీశారు. రైతులను కబ్జాదారులుగా చిత్రీకరించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి బేషరతు గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిషేధిత భూముల జాబితాను కలెక్టర్ల నుంచి ప్రభుత్వం తెప్పించిందని.. తప్పు ప్రభుత్వానిదైతే శిక్ష రైతులకు ఎందుకని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బొంకులేటి అం టూ ఎద్దేవా చేశారు.

ప్రజల భూములను నిషేధిత జాబితాలో చేర్చిన మంత్రి పొంగులేటినే నిషేధిత జాబితాలో పెట్టి అసెంబ్లీకి రా కుండా అడ్డుకోవాలి అంటూ వ్యాఖ్యానించా రు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని నిషేధిత జాబి తా నుంచి తొలగించిన విధంగానే రైతుల భూములను కూడా బేషరతుగా తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

అసెంబ్లీలో 22-ఏ భూముల అంశంపై పోరాడుతామని, రైతుల భూములు తిరిగి దక్కే వరకు ఉద్య మం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రె స్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ఒక్క ర హదారి కూడా నిర్మించలేదని, ట్రైబల్ వెల్ఫే ర్ పనులకు టెండర్లు పిలిచినా బిల్లులు వస్తాయనే నమ్మకం లేక కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఆరోపించారు.

ఈ సదస్సులో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోన ప్ప, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు, ఫిల్మ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నవీన్ పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లాలో వేలాది కుటుంబాలకు నష్టం..

మంచిర్యాల జిల్లాలో వేలాది కుటుంబా లు దశాబ్దాలుగా నివాసాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని అన్నారు. మంచిర్యాల జిల్లాలోనే 5,525 ఎకరాల నాన్ -అగ్రికల్చర్ భూములు ఉన్నాయని తెలిపారు. మంచిర్యాల పరిధిలో సుమారు 10 వేల ఇళ్లకు ఈ సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 59, 76 జీఓల ద్వారా పేదలు, సింగరేణి కార్మికులకు పట్టాలు, ఆస్తి హక్కులు కల్పించిందని గుర్తుచేశారు.

ఇప్పుడు అదే భూములను 22ఏలో చేర్చడం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందన్నారు. మంచిర్యాల్లలో 5,500 ఎకరా లకు పైగా 22ఏలోకి ఎలా వెళ్లాయన్నారు.  ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నడివెళ్లి విజీత్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు