8 June, 2026 | 6:40 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం

03-07-2024 03:43 AM
  • స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క

నాగర్‌కర్నూల్, జూలై 2(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని స్త్రీ, శిశు సంక్షేమ, గ్రామీణా భివృద్ధి శాఖా మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చెంచుపేటల్లో నివసించే చెంచులతో మన్ననూరు లోని ఫారెస్ట్ గెస్ట్‌హౌజ్ ప్రాంగణంలో ముచ్చటించారు.

పోడుభూముల్లో వ్యవసాయం చేసుకునే రైతులను ఇబ్బంది పెట్టొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్, అటవీ అధికారి రోహత్ గోపిడిని అదేశించారు. చెంచులకు విద్య, వైద్యం, వసతి, ఆహారం వంటి సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. అనంతరం అమ్రాబాద్ మండలం తెలుగువల్లి గ్రామం లో కస్తూర్భాగాంధీ పాఠశాలను ప్రారంభించారు. అనం తరం అచ్చంపేట పట్టణంలో 514 మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. వారికి రూ.50.10కోట్ల చెక్కులను అందజేశారు. ఆమెవెంట స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, జడ్పీటీసీ అనురాధ ఉన్నారు.