6 June, 2026 | 1:44 AM

వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో గోదాముల్లో నిల్వ చేస్తాం

06-06-2026 12:00 AM
  1. 100 శాతం కొనుగోలు   కేంద్రాల నుంచి తరలించేందుకు చర్యలు
  2. అధికారులు, లారీ యజమాన్యాలతో చర్చించిన ఎమ్మెల్యే
  3. రైస్ మిల్లులు గోదాములను పరిశీలించిన ‘చింతకుంట’
  4. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం 
  5. పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు 

పెద్దపల్లి, జూన్ 5 (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి రోడ్డులో గల రైస్ మిల్లు గోదాంలో నిల్వచేసిన వరి ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి కొనుగోలు సెంటర్ లో ఉన్నవరి ధాన్యం 98% తరలించామని పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో లారీల జాప్యం హమాలీల కొరత తో అక్కడక్కడ కొంతమేర మిగిలి ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు పెద్దపల్లి, సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ అధ్యక్షలు భారీ, తిరుపతి, శ్రీనివాస్, సతీష్ లతో  మాట్లాడిన పెద్దపల్లి, సుల్తానాబాద్ సీఐలు ప్రవీణ్, రంజిత్ ఎస్‌ఐలు పోలీసులు, అధికారుల సహకారంతో పూర్తిస్థాయిలో తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

హమాలీల కొరత లేకుండా మరి కొంతమంది హమాలీలా తో మాట్లాడామని పెద్ద కల్వల సంతు, నరేష్ లు రాత్రి సమయంలో కూడా వారి సహకారంతో పూర్తిస్థాయిలో రెండు మూడు రోజులలో ధాన్యాన్ని లిఫ్ట్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి లలో అక్కడక్కడ కొన్నిచోట్ల మిగిలిపోయిన ధాన్యాన్ని రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో లిఫ్ట్ చేస్తామని తెలిపారు. కేరళకు రుతుపవనాలు తాగాయని త్వరితగతిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో తరలిస్తామని  అలాగే మక్కాలను సైతం నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో కొనుగోలు చేపట్టామని అవి ఎక్కడికి తరలించాలో అక్కడికి తరలించామని తెలిపారు. ఇప్పటివరకు రైతుల ఖాతాలలో నాలుగు కోట్ల రూపాయలు జమ అయ్యాయని మిగిలిన రూపాయలు సైతం త్వరలోనే రైతుల ఖాతాలో జమ కానున్నట్లు వివరించారు.