నిర్మాతల సంక్షేమానికి కృషి చేస్తాం
- ప్రోగ్రెసివ్ ప్యానెల్ మ్యానిఫెస్టో
- తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఉత్సాహం
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): గత రెండు నెలలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో(Telugu film industry) కొత్త ఉత్సాహం కనిపిస్తోందని ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు కె. అశోక్ కుమార్(K. Ashok Kumar), దాము, మైత్రి రవి(Mythri Ravi) పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను(Telugu film industry) మరింత బలోపేతం చేయడంతో పాటు కొత్త నిర్మాతలకు(Producers) ధైర్యం ఇవ్వ డం, స్వతంత్ర నిర్మాతలకు అండగా నిలవడం, చిన్న, మధ్య తరహా చిత్రాలకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ ప్రధాన సంకల్పమని ప్రోగ్రెసివ్ ప్యానెల్(Progressive Panel) తెలిపింది.
అరులైన నిర్మాతలకు రూ.5 లక్షల వరకు క్యాష్‌లెస్ మెడికల్ ఇన్సూరెన్స్(cashless medical insurance) సదుపాయం కల్పించేందుకు ప్రయత్నిస్తామని తె లిపింది. ఈ సదుపాయం అమల్లోకి వచ్చిన తర్వాత కౌన్సిల్‌లో రీయింబర్స్‌మెంట్ విధానాన్ని పూర్తిగా నిలిపివేస్తామని పేర్కొంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సభ్యులకు అనారోగ్యం లేదా అత్యవసర వైద్య పరిస్థితులు ఎదురైనప్పుడు సహాయం చేసేందుకు పారదర్శక విధానంలో ప్రత్యేకంగా ఏటా రూ.50 లక్షల నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.
తొలిసారి సినిమా నిర్మించే నిర్మాతలు, స్వతంత్ర నిర్మాతలకు బడ్జెటింగ్, లీగల్ కాంట్రాక్టులు, అనుమతులు, నిర్మాణ ప్రక్రియపై సరైన మార్గదర్శకత్వం అందించేందుకు కౌన్సిల్‌లో ప్రత్యేక సింగిల్ విండో ప్రొడ్యూసర్స్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. మహిళా సభ్యుల భద్రతకు కౌన్సిల్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ఫెడరేషన్లు, యూనియన్లు, ఇతర కార్మిక సంఘాలతో ప్రతి నెల క్రమబద్ధమైన చర్చలు నిర్వహించి సమస్యలు వివాదాలుగా మారకముందే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. షూటింగ్‌లు నిరాటంకంగా సాగడంతో పాటు కార్మికులకు న్యాయమైన పని వాతావరణం ఉండేలా పరస్పర గౌరవంతో వ్యవహరిస్తామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు, సభ్యత్వం, ఎన్నికల్లో అభ్యర్థిత్వ అరతలు వంటి అంశాల్లో పూర్తి పారదర్శకత తీసుకొస్తామని ప్రోగ్రెసివ్ ప్యానెల్ తెలిపింది.
నిర్మాతలకు నెలవారీ ఈ--లెటర్
పరిశ్రమకు సంబంధించిన అంశాలపై కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల్లో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నిర్మాత సభ్యులందరికీ ప్రతి నెల ఈ- లెటర్ ద్వారా తెలియజేస్తామని హామీ ఇచ్చింది. స్వతంత్ర చిత్రాలపై అనవసరంగా పడుతున్న డిజిటల్ ప్రొజెక్షన్‌కు సంబంధించిన ఏకపక్ష, అన్యాయ ఆర్థిక భారాలను తొలగించేందుకు దృఢంగా పోరాడతామని తెలిపింది.
సినిమా విడుదలైన వెంటనే పైరసీ వల్ల నిర్మాతలకు కలిగే నష్టాన్ని అరికట్టేందుకు 24/7 పనిచేసే సాంకేతిక--న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తామంది. ఆన్‌లైన్ టికెటింగ్‌లో అధికంగా వసూలు చేస్తున్న కన్వీనియన్స్ ఫీజులు, మల్టీప్లెక్స్‌లలో సాధారణ ప్రేక్షకుడికి భారంగా మారిన ఆహా రం, పానీయాల ధరలపై సంబంధిత ప్రభుత్వ శాఖలతో చర్చించి తగిన నియంత్రణ కోసం కృషి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న సుమారు 306 మంది వార్షిక సభ్యులను ఒకసారి నామమాత్రపు ఫీజు వసూలు చేసి లైఫ్ మెంబర్లుగా మార్చే ప్రతిపాదనను కూ డా మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ఇది కేవలం తమ ఎన్నికల మేనిఫెస్టో కాదని, తెలుగు చిత్ర పరిశ్రమ భవిష్యత్తు కోసం తమ సంకల్పమని పేర్కొంది.






