2 April, 2026 | 3:18 AM

ప్రజా పోరాటాల స్ఫూర్తిని ఇంటింటికీ తీసుకెళ్తాం

02-04-2026 12:00 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

కొత్తగూడెం, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ప్రజా పోరాటాల స్ఫూర్తిని ఇంటింటికి తీసుకెళ్తామని, ఆ దిశగా పార్టీ కార్యకర్తలు నడుం బిగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ’ఇంటింటికి సిపిఐ’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటింటికి సిపిఐ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వివరించారు. వందేళ్ల పోరాట చరిత్ర కలిగిన పార్టీకి ప్రజలు అండగా నిలవాలని, ప్రతి గడపకు వెళ్లి కమ్యూనిస్టుల పోరాటాలను, త్యాగాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని హామీ ఇచ్చారు.

జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు పక్షం రోజుల పాటు ఈ కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, దుర్గరాసి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, వై ఉదయ్ భాస్కర్, కందుల భాస్కర్  పాల్గొన్నారు.