46 డివిజన్‌లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మేయర్
ఖమ్మం టౌన్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఖమ్మం కార్పొరేషన్ 46వ డివిజన్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో రూ.29.50 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించబోవు సిమెంట్ రోడ్లు పనులను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ బుధవారం శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిని వారికి అందించడమే మంత్రి తుమ్మల ద్యేయం అని అన్నారు.
స్థానిక కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి మురికి కాల్వలు, సిసి రోడ్ల నిర్మాణానికి సహకరిస్తున్న మంత్రి తుమ్మలకి, మేయర్ కి, కమిషనర్ కి, మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు షేక్ రజ్జి, ఓబీసీ నగర అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్, కురుమ సంఘం అధ్యక్షుడు మరాటి రమేష్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కన్నం రమేష్, శాలివాహన సంఘం అధ్యక్షుడు శనిగరం ఉప్పలయ్య, రజక సంఘం అధ్యక్షుడు గోనెల రవిశంకర్ నాయకులు దయ్యాల నాగేశ్వరరావు, కాటం యాదయ్య పాల్గొన్నారు.




