2 April, 2026 | 3:18 AM

బాలికల ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ

02-04-2026 12:00 AM

పరిశీలించిన డీడీ రమాదేవి, జీసీడీవో శకుంతల

బెజ్జూర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం డిడి రమాదేవి, జిసిడిఓ శకుంతల సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణులు అయ్యే విధంగా పరీక్షలకు సన్నద్ధులు కావాలని సూచించారు.

అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి పలు సూచనలు చేశారు.భోజనంలో మెను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విద్యార్థుల హాజరు ఉపాధ్యాయుల హాజరు పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు మారుతాయి,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.