వెల్‌కమ్ టు వైల్డ్ లైఫ్
కరుణాడ చక్రవర్తి శివరాజ్‌కుమార్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘వెల్‌కమ్ టు వైల్డ్ లైఫ్’. ‘నిను వీడని నీడను నేనే’, ‘సింగిల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవీకే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కుడిపూడి విజయ్‌కుమార్ నిర్మిస్తున్నారు.
బుధవారం కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను మేకర్స్.. శివరాజ్‌కుమార్, గీత శివరాజ్‌కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ పోస్టర్‌లో శివరాజ్‌కుమార్ లుక్స్ చాలా యంగ్‌గా ఒక చేతిలో కెమెరా ఇంకో చేతిలో సింహం పిల్లను పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, రెగ్యులర్ షూట్ అప్డేట్స్ గురించి మరిన్ని విషయాలు అతి త్వరలో వెల్లడించనున్నారు మూవీ టీమ్.






