15 July, 2026 | 9:13 PM

మద్యం సేవించి వాహనం నడిపిన వారికి జైలు శిక్ష

15-07-2026 09:11 PM

- కమ్యూనిటీ సర్వీస్ విధింపు

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా గొడవలకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న ముగ్గురిపై బోధన్ పట్టణ పోలీసులు కేసులు నమోదు చేసి, వారిని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఈ. సాయి శివ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం నిందితులకు రూ.10, వేల జరిమానా విధించడంతో పాటు ప్రభుత్వ హాస్టల్‌లో ఒక రోజు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశించారు.

అలాగే ఒకరికి వారం రోజుల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. అదేవిధంగా, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఇరువర్గాలు గొడవపడిన వారు, అలాగే రోడ్డు పక్కన బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. మొత్తం 12 మందికి కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించారు. ఇందులో ఐదుగురు అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహించాలని, మరో నలుగురు బోధన్ కొత్త బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.