15 July, 2026 | 9:08 PM

మెగా జాబ్ మేళాలో 225 మంది గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు..

15-07-2026 09:05 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు గిరిజన యువత నుంచి విశేష స్పందన లభించింది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన మొత్తం 20 ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు (MNCs) మరియు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొని అభ్యర్థులకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా **ఫ్లిప్‌కార్ట్ (Flipkart), మెడ్‌ప్లస్ (MedPlus), జీ4ఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ (G4S Security Guards), అపోలో ఫార్మసీ (Apollo Pharmacy), ప్రీమియర్ హెల్త్ సర్వీసెస్ (Premier Health Services), ఐపీఎస్-ఎఫ్‌ఎస్‌ఎస్ (IPS-FSS ) తో పాటు ఇతర ప్రముఖ సంస్థల ప్రతినిధులు వివిధ విభాగాలకు సంబంధించిన ఉద్యోగాల కోసం అభ్యర్థుల అర్హతలు, నైపుణ్యాలను పరిశీలించి ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఇంటర్వ్యూల అనంతరం మొత్తం 225 మంది గిరిజన యువతీ యువకులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ ఉద్యోగాల ద్వారా గిరిజన యువతకు ప్రైవేట్ రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు లభించడం సంతోషకరమని నిర్వాహకులు తెలిపారు.