15 July, 2026 | 9:13 PM

బాధిత కుటుంబానికి అండగా వంగ రాజేశ్వర్ రెడ్డి

15-07-2026 09:12 PM

పుల్లూరులో పరామర్శ.. రూ.5 వేల ఆర్థిక సాయం

సిద్దిపేట రూరల్: రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఏనుగుల మంజుల మృతి చెందిన విషయం తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి బుధవారం ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం తక్షణ సహాయంగా రూ.5 వేల ఆర్థిక సాయం అందజేసి, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  గ్రామ ఉపసర్పంచ్ ఒగ్గు రాజేష్, వార్డు సభ్యులు పూజా ప్రవీణ్, కర్రె లక్ష్మీ శ్రీను, ఉడత సునీత–వైకుంఠం, యాదగిరి, గ్రామ నాయకులు ఒగ్గు మురళి, వి.ఆర్.ఆర్. టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.