16-12-2025 12:00:00 AM
మదీనాగూడలోని సిద్ధార్థ హాస్పిటల్‌లో ప్రారంభం
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): మదీనాగూడలోని సిద్ధార్థ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వెల్ కిన్స్ కార్డియాక్ సెంటర్’ను ప్రముఖ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ ఎస్. గురు ప్రసాద్‌తో పాటు డాక్టర్ సిద్ధార్థరెడ్డి ప్రారంభించారు. ఈ కార్డియాక్ సెంటర్ ప్రారంభంతో శేరిలింగంపల్లి, మియాపూర్, మదీనాగూడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక గుండె వైద్యం అందుబాటులోకి రానుంది.
ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. గురు ప్రసాద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో అనేక కార్డియాలజీ ఆసుపత్రులు, నిపుణులు ఉన్నప్పటికి, సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన గుండె వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక కార్డియాలజీ విభాగాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా కొద్దిమంది వైద్యులు మాత్రమే నిర్వహించే అత్యాధునిక కార్డియాక్ ఇంటర్వెన్షన్లు, ఎలక్ట్రోఫిజియాలజీ చికిత్సలు, రిథమ్ డిసార్డర్స్కు సంబంధించిన ప్రత్యేక వైద్యం ఇప్పుడు వెల్ కిన్స్ కార్డియాక్ సెంటర్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
సామాన్య ప్రజలు కూడా భరించగలిగే తక్కువ ఖర్చుతోనే అదే స్థాయి నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యం అని డాక్టర్ గురు ప్రసాద్ వివరించారు. డాక్టర్ సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ, సిద్ధార్థ హాస్పిటల్లో ప్రారంభమైన వెల్ కిన్స్ కార్డియాక్ సెంటర్ ద్వారా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే తమ లక్ష్యం మరింత బలపడిందని అన్నారు.