28 February, 2026 | 3:48 PM

'మా మాట వినకుంటే'.. ఇరాన్‌ను నాశనం చేస్తాం

28-02-2026 02:10 PM

వాషింగ్టన్: ఇరాన్ మీద దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) తొలిసారి స్పందించారు. ఇరాన్ పై అమెరికా పెద్దఎత్తున యుద్ధ కార్యకలాపాలకు దిగిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ... ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా భారీ సైనిక చర్య ప్రారంభించిందన్నారు. మా మాట వినకుంటే ఇరాన్ ను నాశనం చేస్తాం, ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తోందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుందని ట్రంప్(Trump) వెల్లడించారు. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదర్కొనేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు(American military bases) ముప్పు ఉండటం వల్లే దాడులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 

ఇరాన్ పాలకుల ముప్పు నుంచి అమెరికాను రక్షించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి ఇరాన్(Iran terrorism) అతిపెద్ద మద్దతుదారుగా ఉందని ట్రంప్ ఆరోపించారు. ఇటీవల నిరసనలు చేస్తున్న తన సొంత పౌరులనే వీధుల్లో చంపేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశానికి ఎప్పటికీ అణు ఆయుధాలు ఉండకూడదని ట్రంప్ అన్నారు. అణు ఆయుధాల కోసం వారు చేసే దుర్మార్గపు ప్రయత్నాలు మానుకోవాలని ట్రంప్ హెచ్చరించారు.

అమెరికా, ఇజ్రాయెల్(America, Israel) ఇరాన్ పై క్షిపణులతో విరుచుకుపడ్డాయి. షీల్డ్ ఆఫ్ జూద్ పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. 30 ప్రాంతాలను టార్గెట్ చేసి దాడులు నిర్వహించాయి. నార్త్, ఈస్ట్ టెహ్రాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని(Iran supreme leader khamenei) సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని కార్యాలయం సమీపంలో క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ పేర్కొంది. ఖమేని ఇల్లు, హెడ్ క్వార్టర్స్, రక్షణశాఖ, ఇంటెలిజెన్స్ శాఖ ఆఫీసు సమీపంలో దాడులు జరుగుతున్నాయి. దాడులకు ముందే ఖమేని బంకర్ లోకి వెళ్లినట్లు సమాచారం.