calender_icon.png 16 December, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్’

16-12-2025 12:00:00 AM

సనత్‌నగర్ రెనోవా హాస్పిటల్స్‌లో ప్రారంభం 

హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): రెనోవా హాస్పిటల్స్, ఆర్థోపెడిక్స్ చికిత్సలో ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. మిడ్ లెవెల్ హాస్పిటల్స్ విభాగంలో మొట్టమొదటిసారిగా, అత్యంత అధునాతనమైన కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌ను సనత్ నగర్, జెక్ కాలనీలోని తమ ఆసుపత్రిలో సోమవారం ప్రారంభించింది. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్, సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డితోపాటు గౌరవ అతిథులుగా పింగిలి నరేష్‌రెడ్డి, ఏసీపీ, బాలానగర్ డివిజన్, కె. లక్ష్మీ బాల్‌రెడ్డి, కార్పొరేటర్, సనత్నగర్ డివిజన్, కె. శ్రీనివాసులు, సీఐ, సనత్నగర్, ఎండీ అబ్దుల్ హయ్యూమ్, ఎస్సై, సనత్నగర్, లింగంపల్లి నర్సింగ రావు, సీనియర్ నాయకులు, బీజేపీ, చెక్ కాలనీ కలిసి ప్రారంభించారు.

అతిథులుగా రెనోవా హాస్పిటల్స్ ఉన్నతాధికారులు, ప్రముఖ వైద్య నిపుణులు డా.పి.నీలిమ,హెచ్‌ఓడి, ఆబ్ స్ట్రేట్రిక్స్, గైనకాలజీ, డా. రాజేష్ బొల్లం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మెడికల్, హెమటో ఆంకాలజిస్ట్, హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అత్యాధునిక కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను మిడ్ లెవెల్ హాస్పిటల్స్ లో, ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం అన్నారు.

రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్, సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ప్రాంతం, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్య సంరక్షణలో అత్యుత్తమ సేవలను అందించడమే రెనోవా గ్రూప్ లక్ష్యం అని, ఈ లక్ష్యాన్ని కొనసాగించడానికి మేము మా అన్ని మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో రోబోటిక్ సేవలను ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. హెచ్‌ఓడి - చీఫ్ ఆర్థోపెడిక్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, డా. రాధాకృష్ణ రావు సాగి మాట్లాడుతూ.. రెనోవా హాస్పిటల్స్, సనత్ నగర్ లో తనతో పాటు నిపుణులైన వైద్యులు కలిసి అత్యుత్తమ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ప్రపంచంలోనే అత్యంత అధునాతన రోబోటిక్ సర్జికల్ వ్యవస్థలలో ఒకటైన కోరి రోబోటిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలను మరింత ఖచ్చితత్వంతో, భద్రతతో, వేగవంతమైన కోలుకునే విధంగా చేస్తుంది. ఈ కార్యక్రమంలో డా.ఉదయ భాస్కర్, డా.డి.సుధీర్ రెడ్డి, డా.ప్రశాంత్ బి.ఆర్.కె., డా.పి.మనోజ్ సాయి కుమార్, డా.ఎ.రాజా రామ్, డా.కె.రాఘవ్ సునీల్, డా. మహమ్మద్ ఆసిఫ్ హనీఫ్, డా.జాహిద్, డా.ఆకాష్ జైస్వాల్, డా.అరుణ్ దేవ్, రవీంద్రనాథ్ గరగ, సీవోవో, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, ఖాజా జహీర్ అహ్మద్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ డెవలప్మెంట్, సాయి బాబా, సెంటర్ హెడ్ పాల్గొన్నారు.