11 June, 2026 | 1:03 AM

తడి, పొడి చెత్తను వేరు చేయాలి

11-06-2026 12:02 AM

వెంకటాపూర్ సర్పంచ్ అర్చన 

మొయినాబాద్ జూన్ 10(విజయ క్రాంతి): తడి, పొడి చెత్తను వేరు చేయాలని, వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ పెద్దవేటి అర్చన అజయ్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ పెద్దవేటి అర్చన అజయ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల వ్యవసాయ అధికారిణి అనురాధ, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం వలన కలిగే లాభాలు, ఇవ్వకపోవడం వలన కలిగే అనార్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామ సర్పంచ్ పెద్దవేటి అర్చన అజయ్ రెడ్డి మాట్లాడుతూ..ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం వేయరాదని, చెత్త నియంత్రణ నిర్మూలనతో మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలన్నారు. చెత్తను వేరు చేయడం వల్ల దోమలు, ఈగలు పెరగకుండా దుర్వాసన రాకుండా వ్యాధులు అదుపులో ఉంటాయని తెలిపారు.

ప్రతి ఒక్కరు ఇంటి నుంచి వచ్చే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి పంచాయితీ చెత్త సేకరణ ట్రాక్టర్లలో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభాకర్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్, విద్యుత్ అధికారి ప్రభాకర్, ఏపీఎం మల్లేష్, ఏఎన్‌ఎం సిస్టర్ మన పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, అంగన్వాడి టీచర్ లక్ష్మి, మిషన్ భగీరథ సిబ్బంది యాదయ్య, నరేష్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.