23 April, 2026 | 10:30 AM

బీఆర్‌ఎస్ స్కామ్‌లపై చర్యలేవి?

29-11-2024 02:33 AM
  1. కాంగ్రెస్‌తో ఆ పార్టీది రహస్య బంధం
  2. అన్ని కేసుల్లో కాపాడుతున్నదే కాంగ్రెస్
  3. కేటీఆర్‌కు కేంద్ర మంత్రి బండి కౌంటర్

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీతో బీఆర్‌ఎస్ రహస్య బంధం కొనసాగిస్తోందని, అందుకే బీఆర్‌ఎ స్ స్కామ్‌లపై  నమోదైన అన్ని కేసుల్లోనూ కాంగ్రెస్ సర్కారు బీఆర్‌ఎస్ నేతలను కాపాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

తె లంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కట్టుగా పనిచేస్తున్నాయని కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టుకు గురువారం బండి సంజ య్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌తో జ తకడుతుందని పసిపిల్లలు కూడా నమ్మబోరని చెప్పారు. కాంగ్రెస్‌తో మీ రహస్య బంధ మే మీ ప్రతి కుంభకోణంలోనూ మిమ్మల్ని కాపాడుతున్న తీరును వెల్లడిస్తుందని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

బీఆర్‌ఎస్ పాలన లోనూ విద్యార్థులు ఇబ్బందులు పడితే కేటీఆర్, కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. బీఆర్‌ఎ స్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించిందని.. ఇప్పు డు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నామని స్పష్టంచేశారు. మీలా డ్రామాలు చేయబోమని స్పష్టంచేశారు.